రాజమహేంద్రవరం: వైసిపి బహిష్కృత నేత కంచేటి సాయి రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. పల్నాడు పోలీసులు సాయిపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అరెస్టుపై కంచేటి సాయి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై కక్షపూరితంగా పీడీ చట్టం ప్రయోగించి అరెస్టు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఇసుక తవ్వకాలపై సాయి పోరాటం చేశారు. దండా నాగేంద్ర ద్వారా జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో సాయి కేసు వేయించారు. దీంతో ఎమ్మెల్యే శంకరరావు ప్రోద్బలంతోనే తనపై కేసులు పెట్టారని సాయి ఆరోపించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అక్రమ అరెస్టును తప్పుబట్టింది. సాయిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.










