Sep 16,2023 15:13

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేస్తారని కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నవార్తలు నిజమయ్యాయి. ఈ మేరకు పార్టీ అధినేత కేసిఆర్‌కు రాజీనామా లేఖ పంపారు. పార్టీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రకటించిన మొదటి జాబితాలో తుమ్మలకు టికెట్‌ రాకపోవడం తెలిసిన విషయమే. దీంతో ఆయన గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. మొదట సెప్టెంబర్‌ 17న తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతారని వార్తలు వినిపించాయి. కానీ శనివారం సెప్టెంబర్‌ 16నే ఆయన హస్తం తీర్ధం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.