మట్టితోని సావాసం చేసేటివారు
నాగలితో దుక్కిదున్ని నాట్లేసేవారు!
ఆకలితోని తాము పస్తులుంటూనే
జనులందరి ఆకలినీ తీర్చేటివారు!
వానలకూ వరదలకూ లొంగరూ వారు
కరువు కాటకాలను ఎదిరించువారు!
పుట్టెడు కష్టాలనూ దిగమింగుతూనే
గరిసెలతో ధాన్యము పండించేవారు!
పశువులను ప్రేమతో పెంచేటివారు
పాడితో ఇల్లంతా నింపేటి వారు!
పనిపాటలతో తాము సేదతీరుతూనే
పదిమందికీ మంచిని పెంచేటివారు!
ఎవరయ్యా? ఎవరు? ఎవరు వారు?
మేలును చేకూర్చే రైతులే వారు!
లోకకల్యాణము కోరేటివారు!
దేశసంపద పెంచే అన్నదాతలు వారు!
- రావిపల్లి వాసుదేవరావు
94417 13136










