Mar 09,2023 21:55

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత
దుబాయ్: భారత మహిళా పారా డిస్కస్‌ త్రోయర్‌ ఏక్తా భయాన్‌ రికార్డు ప్రదర్శనతో ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. దుబారులో జరుగుతున్న పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ఫ్రిలో ఏక్తా.. మహిళల వీల్‌ఛైర్‌ డిస్కస్‌ త్రో(ఎఫ్‌-53)లో కాంస్య పతకం సాధించింది. ఈ టోర్నీలో మహిళల వీల్‌ఛైర్‌ డిస్కస్‌ త్రోలో భారత్‌కు పతకం దక్కడం ఇదే ప్రథమం. దీంతో గురువారంతో ముగిసిన పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ఫ్రిలో భారత్‌ 4రజత, 2కాంస్య పతకాలను సాధించింది. ఈ టోర్నీలో చైనా 102(42స్వర్ణాలు) అగ్రస్థానంలో నిలువగా.. ఉక్రెయిన్‌ 11 స్వర్ణాలతో, ఉజ్బెకిస్తాన్‌ 9బంగారు పతకాలతో టాప్‌ా3లో నిలిచాయి. భారత్‌ 28వ స్థానంలో నిలిచింది.