- అగ్రిగోల్డు ప్రతినిధులకు కోర్టు సమన్లు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఎవి రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్ పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఇడి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇడి దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి మెట్రొపాలిటన్ స్పెషల్ కోర్టు విచారణకు స్వీకరించింది. అక్టోబరు 3న కోర్టుకు హాజరుకావాలని అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీల ప్రతినిధులకు కోర్టు సమన్లు జారీ చేసింది. 32 లక్షల మంది డిపాజిటర్లను రూ.6,380 కోట్ల మేర మోసం చేసినట్లు అగ్రిగోల్డ్‌పై అభియోగాలు దాఖలయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రూ.4,141 కోట్ల మేర ఆస్తులను ఇడి అటాచ్ చేసింది.