Jul 01,2022 17:12

ప్రజాశక్తి-మైలవరం (ఎన్‌టిఆర్‌జిల్లా) : మైలవరం లయన్స్‌ ఫ్యామిలీ క్లబ్‌ ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలో వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న ప్రముఖ డాక్టర్లను సత్కరించారు.అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా పలు లయన్స్‌ క్లబ్‌ సభ్యులు మాట్లాడుతూ రోగులకు వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. కరోన సమయంలోను డాక్టర్లు తమ ప్రాణాలను సైతం కూడా లెక్కచేయకుండా కరోన రోగులకు వైద్యం అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మైలవరం జోన్‌ చైర్మన్‌,లయన్‌ టి.దినేష్‌ బాబు,లయన్‌ క్యాబినెట్‌ సెక్రటరీ లయన్‌ జాస్తి వెంకటేశ్వరరావు,మైలవరం లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు,జాగతి,సేవా సంకల్పం సంయుక్త ఆధ్వర్యంలో రాయల్‌ క్లబ్‌ అధ్యక్షుడు మద్దినేని శ్రీనివాసరావు,బయ్యన జగదీష్‌,చిలుకురి రాజారమేష్‌ రెడ్డి, తాడేపల్లి వెంకటేశ్వరరావు, ట్రెజరర్లు, సెక్రటరీలు, జూలూరు భాస్కర రమేష్‌, కోయ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.