ఇంటర్నెట్డెస్క్ : సాధారణంగా అందరూ బెల్లం..వేరుశనగ పప్పును కలిపి తింటారు. ఈ రెంటినీ కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది కూడా. బెల్లంతోపాటు.. వంటింట్లో ఉండే ధనియాల్ని కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బెల్లం, ధనియాలు కలిపి తీసుకుంటే ఎముకలు పటిష్టంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే తరచూ కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ ధనియాలు, బెల్లం కలిపి తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
- ధనియాలు, బెల్లం కలిపి తింటే నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ల నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
- శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బెల్లం, ధనియాలను ప్రతిరోజు రాత్రి నిద్రించడానికి అరగంట ముందు తీసుకోవడంవల్ల మలబద్దకం తగ్గుతుంది.
- శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. నాడీ మండల వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉంటుంది. హార్మోన్ల అసమతుల్య వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు రావు.
పావుటీ స్పూన్ బెల్లం తురుములో అరటీ స్పూన్ ధనియాల పొడిని కలిపి తీసుకోవాలి. ఏదైనా మితంగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు