ఇంటర్నెట్‌డెస్క్ : స్టార్ ఫ్రూట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. ఈ ఫ్రూట్స్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. వర్షాకాలంలో ఈ పండుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
-స్టార్ ఫ్రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది.
- ఈ పండులో కెలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండుని తీసుకుంటే ఫలితం ఉంటుంది.
- ఈ ఫ్రూట్‌లో షుగర్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. మధుమేహస్తులు కూడా ఎలాంటి భయం లేకుండా ఈ పండుని తీసుకోవచ్చు.
- స్టార్ ఫ్రూట్స్ గర్భిణీ స్త్రీలు తీసుకున్నా ఎంతో మంచిది.
- స్టార్ ఫ్రూట్స్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నా.. అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పండును అతిగా తినకుండా ఉంటే మితంగా తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండుని అతిగా తింటే.. మూత్రపిండాల్లో రాళ్లు పెరిగే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.