Jan 16,2023 12:25

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌ (అంబేద్కర్‌ కోనసీమ) : సంక్రాతి కనుమ పండుగ సందర్బంగా... సోమవారం అమలాపురం రూరల్‌ మండలం పేరూరు గ్రామంలోని పేద మహిళలకు గ్రామ సర్పంచ్‌ దాసరి అరుణ చీరలు, స్వీట్స్‌ను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మహిళలకు సర్పంచ్‌ సంక్రాతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ భోగి పండుగ రోజున భోగి మంటల వెలుగులు గ్రామ ప్రజల జీవితాలలో నింపాలని, నమ్ముకున్న భగవంతుడు తోడుగా ఉండాలని భగవంతుడిని కోరానన్నారు. మహిళలందరు చాలా సంతోషించి సర్పంచ్‌ను ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.