Jan 18,2023 10:31

బీజింగ్‌ : గతేడాది కాలంలో చైనా జనాభా 8,50,000 మేర క్షీణించింది. గత 60ఏళ్ల కాలంలో జనాభా క్షీణించడం ఇదే మొదటిసారి. 1961లో దేశవ్యాప్తంగా క్షామం నెలకొన్నపుడు ఈ పరిస్థితి ఎదురైంది. 2022 చివరి నాటికి చైనా జనాభా 141.1కోట్లుగా వుందని మంగళవారం జాతీయ గణాంకాల బ్యూరో తెలియజేసింది. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా ఈ ఏడాది చైనాను భారత్‌ అధిగమిస్తుందని ఐక్యరాజ్య సమితి గతేడాది విడుదల చేసిన నివేదిక పేర్కొంది. చైనాలో 2022లో జననాల సంఖ్య 90.56లక్షలుగా వుంది. 2021తో పోలిస్తే ఈ సంఖ్య 10శాతానికి పైగా తగ్గింది. మరణాల సంఖ్య కోటీ 41లక్షలుగా వుంది. 'ఒక బిడ్డ చాలు' అంటూ ఏళ్ల తరబడి అనుసరిస్తున్న విధానం నుంచి ఎక్కువమంది పిల్లలను కనాలంటూ గత దశాబ్ద కాలంగా చైనా ప్రభుత్వం ప్రచారం చేస్తూ వచ్చింది.