- దస్తగిరి అప్రువర్ గా మారటాన్ని సవాల్ చేస్తూ హై కోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎ 4 నిందితుడు దస్తగిరి ఆప్రువర్ గా మారటాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హై కోర్టులో సోమవారం పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్ మెంట్ మేరకే ఈ కేసులో భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు ఎంపి అవినాష్ రెడ్డి ని సిబిఐ విచారిస్తోంది. సిబిఐ చెప్పినట్టుగానే దస్తగిరి స్టేట్ మెంట్ ఇస్తున్నారని, దాని ఆధారంగా తమను నేరంలోకి నెట్టడం సమంజసం కాదని భాస్కర్ రెడ్డి కోర్టు దఅష్టికి తీసుకెళ్లారు. వివేకా హత్య కేసులో కీలక పాత్ర పోషించిన్ దస్తగిరి కి బెయిల్ ఇవ్వటం సరికాదనీ, బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు. వివేక హత్యకు వాడిన ఆయుధాన్ని ఆయనే కొనుగోలు చేసి తీసుకొచ్చారని పిటిషన్ లో భాస్కర్ రెడ్డి తెలిపారు.










