Jul 14,2023 11:48

ఢిల్లీ : క్షీరదాల్లో తరచూ బర్డ్‌ ఫ్లూ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ వైరస్‌ మానవులకు సోకేలా పరిణామం చెందే అకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా హెచ్చరించింది. ఏవీయిన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు సాధారణంగా పక్షులను టార్గెట్‌ చేస్తాయి. అయితే, ఇటీవల కాలంలో మామల్స్‌లోనూ (క్షీరదాలు) బర్డ్‌ ఫ్లూ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా, ఈ వైరస్‌లో మార్పులు జరిగి మనుషుల్లో వ్యాపించే సామర్థ్యం సంతరించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మనుషులు, జంతువులకూ హాని కలిగించే కొత్త తరహా వైరస్‌లూ పుట్టుకురావొచ్చని హెచ్చరించింది.