Sep 15,2023 11:48

తెలంగాణ : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ .... హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్‌ వద్ద ఆందోళనలకు సిద్ధమైన ఐటిఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే. శుక్రవారం నగరంలోని ఐటి ఉద్యోగులు చేపడుతున్న నిరసనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈరోజు కూడా ఐటి ఉద్యోగులు పలు ప్రాంతాల్లో ఆందోళనలకు పిలుపునివ్వడంతో ... ఐటి ఉద్యోగుల నిరసనలకు ఎలాంటి అనుమతి లేదంటూ మాదాపూర్‌ డిసిపి స్పష్టం చేశారు. మాదాపూర్‌, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌ రాంగూడలో పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల అనుమతి లేకుండా ఆందోళన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాన్య ప్రజలకు ఆటంకం కలిగిస్తే సీరియస్‌ యాక్షన్‌ ఉంటుందన్నారు. ఆందోళన చేసే ఐటి ఉద్యోగుల కంపెనీలకు నోటీసులు పంపిస్తామని హెచ్చరించారు.