Sep 23,2023 17:20

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిలో స్థానికులు ఆందోళన చేస్తున్నారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై మృతదేహంతో సిద్ధాంతి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల దూరం భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. శంషాబాద్‌-గగన్‌పహాడ్‌ వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. వాహనాలను రోడ్లపై వదిలి ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులు పరుగులు పెడుతున్నారు. గ్రామస్తులు మాట వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి ట్రాఫిక్‌ క్లియర్‌ చేసే పనిలో పడ్డారు.