Jul 16,2023 12:43

ప్రజాశక్తి-టెక్కలి రూరల్‌ (శ్రీకాకుళం) : గ్రానైట్‌ క్వారీలో కంప్రెషర్‌ పేలి క్వారీలోని కార్మికుడు మృతి చెందిన ఘటన ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బొరిగిపేట సమీపంలో సిహెచ్‌ గ్రానైట్‌ క్వారీలో కంప్రెషర్‌ పేలి క్వారీలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న బీహార్‌ రాష్ట్రానికి చెందిన భూషణ్‌ దాస్‌ (50) మృతి చెందగా, మరో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. కంప్రెషర్‌ ఒక్కసారిగా పేలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఒక కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరిని శ్రీకాకుళంకు తరలించారు. ఎస్‌ఐ ఎల్‌ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.