Sep 01,2023 12:35

ఇంటర్నెట్‌డెస్క్‌ : భారతీయ వంటకాల్లో తరచూ వాడే యాలకుల వల్ల రుచితోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా యాలకులతో బీపీకి చెక్‌ పెట్టొచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రక్తపోటును నియంత్రించే గుణాలు : యాలకులలో అధిక రక్తపోటును నియంత్రించే గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణుల పరిశోధనలలో వెల్లడైంది. బీపీ లెవెల్స్‌ను సాధారణ స్థాయికి తీసుకురావడంలో ఇవి బాగా సహాయపడతాయి. వీటిల్లో ఉండే ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్‌తో పాటు ఇతర ఔషధ గుణాలు బీపీని అదుపులో ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడతాయి. శరీరంలో ఉండే అధిక సోడియం, పొటాషియంలను బయటకు పంపేందుకు ఇవి ఉపయోగపడతాయి.

- యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. వీటిని తరచూ ఆహారంతో చేర్చుకోవడం వల్ల అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తాయి. సీజనల్‌ వారీగా వచ్చే అలర్జీలు తుమ్ములు, దురద, కళ్లు ఎర్రబడటం వంటి అలెర్జీ లక్షణాలను యాలకులు తగ్గిస్తాయి.

- శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. జలుబు, దగ్గు, బ్రాంకైటీస్‌ వంటి శ్వాసకోస సమస్యలను తగ్గించడంలో చక్కగా పనిచేస్తాయి. అలాగే యాలకులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న యాలకులను తరచూ ఆహారంలో చేర్చుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..