Nov 03,2022 16:06

ప్రజాశక్తి - గంపలగూడెం(ఎన్‌టిఆర్‌) : దికిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా చారు గుండ్ల వెంకట సుబ్బారావు ఏడోసారి ఎన్నికయ్యారు. అసోసియేషన్‌ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ ఎన్నికలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైంది. సెక్రెటరీగా సముద్రాల నరేంద్రరావు, ఉపాధ్యక్షునిగా కోరుకొండ రామ మధుబాబు, ట్రెజరర్‌ బొడ్డు మురళీకృష్ణలతో పాటు మరో పదహారు మంది సభ్యులు ఉన్నారు.