Sep 23,2023 11:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తనపై సిఐడి నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని టిడిపి నిర్ణయించింది. ఈమేరకు పార్టీ సీనియర్‌ నాయకులు నిర్వహించిన చర్చల్లో సోమ లేదా మంగళవారాల్లో సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు. దీనికోసం టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్‌ మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.