Sep 23,2023 14:36

ప్రజాశక్తి-అమరావతి: స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్‌ చేశారు. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్‌లో ఆయన న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈరోజు, రేపు విచారణ కొనసాగనుంది.