హైదరాబాద్ : టీడీపీ అధినేత అక్రమం అంటూ ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించడం ఐటీ ఉద్యోగులు.. ఇవాళ హైదరాబాదులో తమ కుటుంబ సభ్యులతో కలిసి సొంత కార్లలో రోడ్లపైకి వచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐటీ ఉద్యోగులు నానక్ రామ్ గూడ నుంచి కార్లతో ర్యాలీగా బయల్దేరగా, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓఆర్‌ఆర్ పై కార్ల ర్యాలీకి అనుమతి లేదని నిరసనకారులకు పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్-ముంబయి జాతీయ రహదారిపై ఎగ్జిట్-3 వద్ద ర్యాలీకి అంతరాయం ఏర్పడింది. ఐటీ ఉద్యోగులను ఎగ్జిట్-3 నుంచి వారి కార్లతో సహా బయటికి పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.










