- కోల్‌కతాపై తొమ్మిది వికెట్ల తేడాతో రాజస్తాన్ గెలుపు
కోల్‌కతా : బౌలింగ్‌లో యజ్ఞేంద్ర చాహల్.. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ రికార్డులు నెలకొల్ప డంతో రాజస్తాన్ జట్టు 9 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత చాహల్ స్పిన్ మాయాజాలానికి కోల్‌కతా జట్టు నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు 149పరుగులు చేసింది. ఛేదనలో రాజస్తాన్ ఓపెనర్ జైస్వాల్ రికార్డు అర్ధసెంచరీతో మెరవడంతో ఆ జట్టు 13.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి 151పరుగులు చేసి ఘన విజయం సాధించింది. దీంతో రాజస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకి ప్లే-ఆఫ్ ఆశలు సజీవం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్ జేసన్ రారు(10) మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత గుర్బాజ్(18) కూడా త్వరగా పెవీలియన్‌కు చేరడంతో ఆ జట్టు 29పరుగులుకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో వెంకటేశ్ అయ్యర్ అర్ధసెంచరీకి తోడు కెప్టెన్ నితీశ్ రాణా(22) కొద్దిసేపు క్రీజ్‌లో పాతుకు పోయారు. వీరిద్దరినీ చాహల్ పెవీలియన్‌కు పపండం, ఆ తర్వాత శార్దూల్, రింకూలను కూడా ఔట్ చేయడంతో కోల్‌కతా జట్టు కోలుకోలేక పోయింది. ఆండీ రస్సెల్(10), రింకూ సింగ్(16), రెండంకెల స్కోర్ చేయగా.. శార్దూల్(1), నరైన్(6) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చాహల్‌కు నాలుగు, బౌల్ట్‌కు రెండు, సందీప్ శర్మ, ఆసిఫ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో రాజస్తాన్ ఓపెనర్ జైస్వాల్(98నాటౌట్; 47బంతుల్లో 13ఫోర్లు, 5సిక్సర్లు), సంజు శాంసన్(48నాటౌట్; 29బంతు ల్లో 2ఫోర్లు, 5సిక్సర్లు) మ్యాచ్‌ను ముగించారు. మరో ఓపెనర్ జాస్ బట్లర్(0)ను ఆండీ రస్సెల్ రనౌ ట్ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జైస్వాల్‌కు లభించింది.
చాహల్ రికార్డు
యజ్ఞేంద్ర చాహల్ ఐపిఎల్‌లో ఓ రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ఐపిఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్ నిలిచాడు. కోల్‌కతా కెప్టెన్ నితీశ్ రాణాను ఔట్‌చేసి ఐపిఎల్‌లో అత్యధిక వికెట్లు(184వికెట్లు) తీసిన బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్‌కు చెందిన డ్వైన్ బ్రేవో (183 వికెట్లు) పేరిట ఉండేది. చాహల్ 143మ్యాచుల్లోనే 184వికెట్లు తీశాడు. కోల్‌కతాపై 4ఓవర్లలో 25పరుగులిచ్చి 4వికెట్లు తీసి 187 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అలాగే ఈ సీజన్ -16లోనూ 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఐపిఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో పియూష్ చావ్లా(ముంబయి ఇండియన్స్- 174 వికెట్లు), అమిత్ మిశ్రా (లక్నో సూపర్‌జెయింట్స్- 172 వికెట్లు), ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (రాజ స్తాన్ రాయల్స్-171వికెట్లు) టాప్-5లో ఉన్నారు.
13బంతుల్లోనే జైస్వాల్ అర్ధసెంచరీ
రాజస్తాన్ యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి రికార్డు నెలకొల్పాడు. కోల్‌కతాపై జైస్వాల్ 13బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు సాయంతో 50పరుగులు చేశాడు. దీంతో ఐపిఎల్ చరిత్రలో వేగంగా అర్ధసెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా జైస్వాల్ రికార్డు సృష్టిం చాడు. అంతకుముందు ఈ రికార్డు కేఎల్ రాహు ల్ ఢిల్లీపై, పాట్ కమ్మిన్స్‌ముంబయి ఇండియన్స్‌పై 2022లో 14బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. తాజాగా ఆ రికార్డును జైస్వాల్ అధిగమించాడు.
స్కోర్‌బోర్డు..
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : జేసన్ రారు (సి)హెట్‌మైర్ (బి)బౌల్ట్ 10, గుర్బాజ్ (సి)సందీప్ శర్మ (బి)బౌల్ట్ 18, వెంకటేశ్ అయ్యర్ (సి)బౌల్ట్ (బి)చాహల్ 57, నితీశ్ రాణా (సి)హెట్‌మైర్ (బి)చాహల్ 22, ఆండీ రస్సెల్ (సి)అశ్విన్ (బి)ఆసిఫ్ 10, రింకూ సింగ్ (సి)రూట్ (బి)చాహల్ 16, శార్దూల్ (ఎల్‌బి) చాహల్ 1, అనుకుల్ రారు (నాటౌట్) 6, సునీల్ నరైన్ (సి)రూట్ (బి)సందీప్ శర్మ 6, అదనం 3. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 149పరుగులు. వికెట్ల పతనం: 1/14, 2/29, 3/77, 4/107, 5/127, 6/129, 7/140, 8/149 బౌలింగ్: బౌల్ట్ 3-0-15-2, సందీప్ శర్మ 4-0- 34-1, అశ్విన్ 4-0-32-0, రూట్ 2-0- 14-0, చాహల్ 4-0-25-4, ఆసిఫ్ 3-0-27-1.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : జైస్వాల్ (నాటౌట్) 98, బట్లర్ (రనౌట్) రస్సెల్ 0, సంజు శాంసన్ (నాటౌట్) 48, అదనం 5. (13.1ఓవర్లలో వికెట్ నష్టానికి) 151పరుగులు. వికెట్ల పతనం: 1/30 బౌలింగ్: నితీశ్ రాణా 1-0-26-0, హర్షీత్ రాణా 2-0-22-0, శార్దూల్ ఠాకూర్ 1.1-0-18-0, వరణ్ చక్రవర్తి 3-0-28-0, సునీల్ నరైన్ 2-0-13-0, సుయాశ్ శర్మ 3-0-22-0, అనుకుల్ రారు 1-0-20-0.










