Feb 09,2023 12:37

ఇంటర్నెట్‌డెస్క్‌ : తక్కువ వయసులోని మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశముందా? అసలు ఎందుకొస్తుంది? రావడానికి గల కారణాలేంటి? వంటి విషయాలపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందామా..?!

- 24 ఏళ్ల బ్రిటనీ అనే మహిళ గుండెపోటుకు గురై కుప్పకూలిపోయింది. వెంటనే వైద్యులు సిపిఆర్‌ చేసి ప్రాణాల్ని కాపాడారు. బ్రిటనీ రోజూ వ్యాయామం చేసినా.. సమతుల్య ఆహారం తీసుకున్నా.. ఆమె గుండెపోటు రావడానికి గల కారణం క్యూటీ సిండ్రోమ్‌ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుందోని.. అందువల్లే ఆమె గుండెపోటుకు గురైందని వైద్యులు తెలిపారు.
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వయసు తక్కువైనా.. గుండెపోటు వచ్చే అవకాశముందని వైద్యులు సూచించారు.
- మూర్ఛవ్యాధి సంకేతాలుగా ఉన్న క్యూటి సిండ్రోమ్‌ ఒక్కోసారి పిసిఆర్‌ చికిత్స చేసే అవకాశం కూడా ఉండదని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా గుండె పనితీరు ఆగిపోయి మృతి చెందే అవకాశముంటుందని వైద్యులు చెబుతున్నారు.