Sep 16,2023 18:57

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి రాజమహేంద్రవరంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ర్యాలీలో స్థానిక మహిళలు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. తిలక్‌ రోడ్డులోని సాయి బాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్‌ రామాలయం జంక్షన్‌ వరకూ ఈ ర్యాలీ జరిగింది. కొవ్వొత్తుల ర్యాలీకి వివిధ మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టిడిపి నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.