న్యూఢిల్లీ : సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 4న వాయిదా పడిన సీయూఈటీ-యూజీ (CUET-UG ) పరీక్షను ఈ నెల 24-28 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది. మొదట ఆగస్ట్ 12, 14 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే వరుస పండుగల నేపథ్యంలో పరీక్ష తేదీల్ని మార్చాలని పలువురు విద్యార్థులు విజ్ఞప్తి చేసినట్లు ఎన్‌టిఎ తెలిపింది. దీంతో కొత్త తేదీల్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. వీరికి కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేస్తామని పేర్కొంది. కానీ, దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 4న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CUET-UG ) నిర్వహించారు. సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో కొన్ని కేంద్రాల్లో తొలి విడత, మొత్తం 489 కేంద్రాల్లో రెండో విడత పరీక్షలు రద్దయ్యాయి. దీంతో మరోసారి పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందని ఎన్‌టిఎ తెలిపింది.










