Sep 15,2023 12:09

విజయనగరం : విజయనగరంలో ఐదు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను సిఎం జగన్‌ శుక్రవారం ప్రారంభించారు. ముందుగా మెడికల్‌ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను జగన్‌ పరిశీలించారు. ట్రీట్మెంట్‌కు సంబంధించిన వివరాలు వైద్యులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో సిఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినీ, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. మెడికల్‌ కాలేజీల ప్రారంభం అనంతరం వర్చువల్‌ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు సిఎం జగన్‌ ప్రారంభోత్సవం చేశారు.