ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిఎం జగన్ సలహాదారు అజేయ కల్లం తీరుపై సిబిఐ అసహనం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసులో తన వాంగ్మూలాన్ని వక్రీకరించారని హైకోర్టులో అజేయ కల్లం వేసిన పిటిషన్‌పై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. జగన్‌ను భారతి పైకి పిలిచారని తాను చెప్పినట్లు తప్పుగా చెప్పారని, అజేయ కల్లం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణ సమయంలో అజేయ కల్లం ఆడియోను రికార్డింగ్ చేసినట్లు సిబిఐ వెల్లడించింది. ఈ మేరకు రికార్డింగ్‌ను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది.