Aug 26,2023 12:37

ఇంటర్నెట్‌డెస్క్‌ : మహిళలు వస్త్రధారణలో భాగంగా బ్రాలు వేసుకోవడం తప్పనిసరి. అయితే బ్రాల వల్ల రక్తనాళాలు ఒత్తిడికి గురవుతాయి. దీంతో వెన్నునొప్పి, మెడ, భుజాలు, చేతుల నొప్పులు వంటివి వస్తాయి. ఇలాంటి సమస్యల్ని మధ్య వయసు మహిళలు ఎక్కువగా అనుభవిస్తారు. ముఖ్యంగా ఏదైనా పనిచేసేటప్పుడు, వస్తువుల్ని మోసుకెళ్లేటప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు బరువైన వస్తువుల్ని మోయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. కొంతమంది మహిళల్లో విశ్రాంతి తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. మరికొంతమందిలో నొప్పి తీవ్రస్థాయిలో ఉంటుంది. అలాంటివారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే నాసిరకమైనవి కాకుండా.. నాణ్యత కలిగిన బ్రాలు వేసుకుంటే అలర్జీ వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.