హైదరాబాద్ : ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్ సి 20వ వార్షికోత్సవం సందర్బంగా పలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. ఈ భారీ ఆఫర్లు డిసెంబర్ 3 నుంచి 2023 జనవరి 29 వరకు అందుబాటులో ఉంటాయని బిగ్ సి వ్యవస్థాపకులు, సిఎండి యం బాలు చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. తమ వద్ద స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టివి, ల్యాప్ టాప్ కొనుగోలు చేసిన ఖాతాదారులకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు 20 కార్లు, 20 బైకులు, 20 ఎసిలు, 20 రిఫ్రిజిరేటర్లు, 20 టివిలు బహుమతిగా ఇస్తామని ఆయన తెలిపారు. వీటితో పాటు ప్రతీ మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి, 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, సులభ వాయిదాల పద్దతిలో చెల్లింపులు, డౌన్ పేమెంట్ లేకుండా మొబైల్ కొనుగోలు సౌకర్యం కల్పించనున్నామన్నారు. బ్రాండ్ అస్సెస్సరీస్‌పై 51 శాతం వరకు రాయితీ, పలు బ్రాండెడ్ మొబైల్ ఫోన్లపై రూ.10,000 వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నామన్నారు.










