ఎండలు మండుతున్నాయి. ఈ కాలంలో వేసవి తాపాన్ని తీర్చాలంటే.. జ్యూస్‌లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. వైద్యులు కూడా ఈ కాలంలో మజ్జిగ ఎక్కువగా తీసుకోమని సలహా ఇస్తారు. మజ్జిగతో చేసే లస్సీ వంటివి రోజూ తాగినా.. కీరదోసకాయతో తయారుచేసే చాస్‌ని కూడా తాగితే.. డీహైడ్రేషన్‌కి లోనుకాకుండా ఉంటారు. మరి కుకుంబర్ చాస్‌ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందామా..!
పదార్థాలు
కీరదోసకాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, మజ్జిగ - 500 ఎం.ఎల్, జీలకర్ర పొడి - అర టేబుల్ స్పూను, బ్లాక్ సాల్ట్ - అరటేబుల్‌స్పూను, ఉప్పు - అరటేబుల్‌స్పూను, పుదీనా - రెండు లేదా మూడు, ఐస్ - కొద్దిగా.
తయారుచేసే విధానం
కీరదోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని మిక్సీజార్‌లో వేసుకుని, పచ్చిమిర్చిని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకొని అందులో మజ్జిగ వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో జీలకర్రపొడి, బ్లాక్ సాల్ట్, ఉప్పు, పుదీనా ఆకులు, కొద్దిగా ఐస్ వేసుకుని కలుపుకోవాలి. దీన్ని గ్లాస్‌ల్లో సర్వ్ చేసుకుని తాగితే.. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కీరదోసకాయ, మజ్జిగ ఉండడం వల్ల కూల్‌గా ఉంటుంది.