ప్రజాశక్తి-నందలూరు (అన్నమయ్యజిల్లా) : మండల పరిధిలోని పలు గ్రామాలలో విష జ్వరాలు నమోదవుతున్న నేపథ్యంలో మండల వైద్య శాఖ ఆధ్వర్యంలో ఈడిగ పల్లి, మదనమోహన పురం, పోత్తపి గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు మండల వైద్యాధికారిని డాక్టర్ సృజన తెలిపారు. విష జ్వరాలు నమోదైన గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసి ఆయా గ్రామాలలో జ్వర పీడితులకు రక్త పరీక్షలు, వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల సహకారంతో దోమల మందు పిచికారీ చేయించాలని, మురుగు నీటి నిల్వ లేకుండా చూడాలని ఏన్‌ఎంలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి, సిహెచ్‌ఓ నారాయణ, మలేరియా సబ్ యూనిట్ అధికారి స్వామి దాస్, టీబి సూపెర్వైసోర్ జయ ప్రకాష్, హెల్త్ అసిస్టెంట్ సుబ్బయ్య, ఎంల్‌హెచ్‌పిలు, ఏన్‌ఎంలు, ఆశలు, పాల్గొన్నారు.










