ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో సీఎస్‌కే విజేతగా నిలిచి ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. కాగా ఈ సారి బిసిసిఐ వినుత్నంగా ఆలోచించి.. ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో నయోదయ్యే ప్రతీ డాట్‌బాల్‌కు 500 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు 84 డాట్ బాల్స్ వేశారు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 96 డాట్ బాల్స్.ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 2వ క్వాలిఫయర్‌లో 67 డాట్ బాల్స్. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం డాట్ బాల్స్ 45. నమోదయ్యాయి. ఈ 4 మ్యాచ్‌ల నుంచి మొత్తం 292 డాట్ బాల్స్‌ను బౌలర్లు వేశారు. ఈ లెక్కన బీసీసీఐ మొత్తం 1 లక్షా 46 వేల మొక్కలు నాటనుంది. దీని ద్వారా గ్రీన్ డాట్ ప్రచారంలో ఐపీఎల్ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టింది.










