Mar 27,2023 15:05

ముంబై : 2022-23 ఏడాదికిగాను టీమ్‌ ఇండియా ఆటగాళ్ల సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. మొత్తం 26 మంది ఆటగాళ్లకు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించింది. ఈ లిస్ట్‌లో ఆల్‌ రౌండర్‌ జడేజా, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌కు ప్రమోషన్‌ వచ్చింది. ఏ ప్లస్‌ గ్రేడ్‌ ప్లేయర్‌గా జడేజా స్థానం సొంతం చేసుకోగా, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌ బీ గ్రేడ్‌ నుంచి ఏ గ్రేడ్‌కు ప్రమోషన్‌ పొందాడు. వరుసగా విఫలమవుతోన్న కేఎల్‌ రాహుల్‌ బి గ్రేడ్‌కు పడిపోయాడు. కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నా బుమ్రా ఏ ప్లస్‌ గ్రేడ్‌లో స్థానం పదిలం చేసుకున్నాడు.
గ్రేడ్‌ల వారిగా వార్షిక రెమ్యునరేషన్స్‌ ప్రకటించింది బీసీసీఐ. ఏ ప్లస్‌ గ్రేడ్‌ ఆటగాళ్లకు ఏడు కోట్లు, ఏ గ్రేడ్‌ ఆటగాళ్లకు ఐదు కోట్లు, బీ గ్రేడ్‌ ఆటగాళ్లకు 3 కోట్లు, సీ గ్రేడ్‌ క్రికెటర్స్‌కు కోటి రూపాయలుగా రిటైనర్‌షిప్‌ ఫీజును నిర్ణయించింది.

  • బీసీసీ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితా

ఏప్లస్‌ గ్రేడ్‌ : విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, బుమ్రా, జడేజా
ఏ గ్రేడ్‌ : హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ, రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌
బీ గ్రేడ్‌ : ఛటేశ్వర్‌ పుజారా, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మహ్మద్‌ సిరాజ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌
సీ గ్రేడ్‌ : ఉమేష్‌ యాదవ్‌, శిఖర్‌ ధావన్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సంజూ శాంసన్‌, అర్షదీప్‌సింగ్‌, కేఎస్‌ భరత్‌

  • సీనియర్‌ ఆటగాళ్లకు షాక్‌

టీమ్‌ ఇండియా ఆటగాళ్ల సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ బిసిసిఐ సినీయర్‌ ఆటగాళ్లకు షాక్‌ ఇచ్చింది. ఈ లిస్ట్‌ నుంచి లిస్ట్‌లో భువనేశ్వర్‌ కుమార్‌కు చోటు దక్కలేదు. భువీతో పాటు సీనియర్‌ ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్‌ శర్మకు కూడా తమ కాంట్రాక్ట్‌లను కోల్పోయారు.