Dec 26,2022 10:57

న్యూఢిల్లీ : ఆటో మొబైల్‌ మార్కెట్‌లో భవిష్యత్‌లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొనుగోలు దారుల అవసరాలకు అనుగుణంగా కార్ల మోడళ్లలో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు కార్ల తయారీ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో 'ఆటో గేర్‌ షిఫ్ట్‌ (ఎజిఎస్‌)' సిస్టంను ప్రధానంగా పేర్కొంటున్నారు. ఏజీఎస్‌ సిస్టమ్‌ వల్ల డ్రైవర్‌గా గేర్‌ మార్చాలంటే క్లచ్‌ నొక్కి బ్రేక్‌ వేయనవసరం లేదు. అవసరాన్ని బట్టి ఆటోమేటిక్‌ గేర్‌ మారుతూ ఉంటుంది. దేశంలోట్రాఫిక్‌ రద్దీలో వాహనదారులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా మారుతి సుజుకీ మరిన్ని మోడళ్లలో 'ఆటో గేర్‌ షిఫ్ట్‌ (ఏజీఎస్‌)' సిస్టంను అందుబాటులోకి తేనున్నట్లు ఆ సంస్థ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ శశాంక్‌ శ్రీవాత్సవ తెలిపారు.