Mar 11,2023 09:51

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా సీనియర్‌ ఓపెనర్‌ షాన్‌ మార్ష్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 39 ఏళ్ల షాన్‌ మార్ష్‌.. 2001లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా తరపున ఫస్ట్‌ క్లాస్‌ అరంగేట్రం చేసాడు. చివరగా 2019లో టెస్టు, వన్డే మ్యాచ్‌ ఆడాడు. 38 టెస్టుల్లో 2,265 పరుగులు చేసిన షాన్‌.. 73 వన్డేల్లో 2,773.. 15 టీ29ల్లో 255 పరుగులు సాధించాడు. అతను టెస్టుల్లో 6, వన్డేల్లో 7 శతకాలు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో షాన్‌.. 183 మ్యాచ్‌ల్లో 12,032 పరుగులు సాధించాడు. అందులో 32 శతకాలున్నాయి.