- సెమీస్‌కు జకోవిచ్, టఫీ
- నేడు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లోకి భారత జోడీ రోహన్ బొప్పన్న-సానియా మీర్జా ప్రవేశించారు. ఉత్కంఠభరితంగా బుధవారం జరిగిన తొలి సెమీస్‌లో భారత జోడీ 7-6(7-5), 6-7(5-7), 10-6తో 3వ సీడ్, సుప్స్రీ(బ్రిటన్)-క్రాజిక్(అమెరికా)పై పోరాడి నెగ్గారు. మార్గరెట్ కోర్ట్ ఎరేనాలో జరిగిన ఈ మ్యాచ్ చివరి పాయింట్ వరకు పోటాపోటీగా సాగింది. ఈ గెలుపుతో బొప్పన్న-సానియా మీర్జా జోడీ తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరి రికార్డు నెలకొల్పారు. తొలిసెట్‌ను టైబ్రేక్‌లో గెలిచినా.. రెండో సెట్‌ను టైబ్రేక్‌లోనే కోల్పోయింది. దీంతో మూడో గేమ్‌లో పాయింట్లను కేటాయించగా.. భారత జోడీ ఓ దశలో 5-1పాయింట్ల ఆధిక్యతలో నిలిచింది. ఓ దశలో 8-6పాయింట్లతో చేరువైనా.. చివరి 10-6తో ముగించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. బొప్పన్న 2017లో కెనడాకు చెందిన గాబ్రియేలాతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలిచాడు. 2018లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ రన్నరప్ కూడాను. ఇక సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ మినహా అన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గింది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో గత ఏడాది వింబుల్డన్ సెమీస్‌కు చేరగల్గింది. సానియా చివరి సారిగా 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను మహిళల డబుల్స్‌లో చేజిక్కించుకుంది. మరో సెమీస్‌లో బ్రెజిల్ స్టెఫానీ-మటోస్ జోడీ 4-6, 6-4(11-9)తో ఆస్ట్రేలియా జోడీ గడెక్కీ-పోల్మన్స్‌పై గెలిచారు. శనివారం జరిగే టైటిల్ పోరులో భారతజోడీ బ్రెజిల్ జంటతో తలపడనున్నారు.
- సెమీస్‌కు జకో, టఫీ
పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి 4వ సీడ్, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ ప్రవేశించాడు. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో జకోవిచ్ 6-1, 6-2, 6-4తో 5వ సీడ్ ఆండీ రుబ్లేవ్(రష్యా)పై వరుససెట్లలో గెలిచాడు. మరో సెమీస్‌లో టామీ పాల్(అమెరికా) 7-6(8-6), 6-3, 5-7, 6-4తో సహచర ఆటగాడు షెల్టన్‌పై గెలుపొందాడు. ఇక మహిళల సింగిల్స్ సెమీస్‌కు లినెట్టె(పోలండ్), సబలెంక(రష్యా) ప్రవేశించారు. క్వార్టర్స్‌లో 5వ సీడ్ సబలెంకా(రష్యా) 6-3, 6-2తో క్రొయేషియాకు చెందిన వేకిక్‌పై, లినెట్టె 6-3, 7-5తో 30వ సీడ్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్లిస్కోవాపై గెలిచి సెమీస్‌కు చేరారు.
సెమీఫైనల్స్(సింగిల్స్)
పురుషులు..
జకోవిచ్ × టామీ పాల్
ఖచనోవ్ × సిట్సిపాస్
మహిళలు..
రైబకినా × అజరెంకా
లినెట్టె × సబలెంకా










