ప్రజాశక్తి-పూతలపట్టు (చిత్తూరు జిల్లా) :చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం అయ్యప్పగారిపల్లి పంచాయతీ పరిధిలోని తోటవారిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాను హేమంత్ కుమార్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన ఉద్యోగరీత్యా చండీఘర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్యం కారణంతో చండీఘర్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య వందన, పాప, బాబు ఉన్నారు. గత మూడు నెలల క్రితం స్వగ్రామమైన తోటవారిపల్లెకి ఆయన వచ్చారు. పది రోజుల క్రితమే తిరిగి విధుల్లో చేరారు. చండీఘర్‌లో విధులు నిర్వహిస్తుండగా మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు చండీఘర్‌కు బయలుదేరారు. సోమవారం మధ్యాహ్నం స్వగ్రామానికి మృతదేహన్ని తీసుకురానున్నారు.










