ఇంటర్నెట్‌డెస్క్ : ప్రస్తుత జీవన విధానంలో చాలా మార్పులొచ్చాయి. ఉరుకుల పరుగుల జీవితంలో.. చాలామంది స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తింటారు. రోడ్డుపై తినాలంటే కచ్చితంగా నిలబడి తినాల్సిందే. స్ట్రీట్ ఫుడ్స్ మాత్రమే కాదు.. పెళ్ళిళ్లైనా, ఫంక్షన్స్ అయినా.. హోటల్స్‌లో అయినా అందరూ నిలబడి తినడం చూస్తూనే ఉంటాం. ఏదో ఒకరోజూ రెండురోజులు అయితే పరవాలేదు. కానీ ప్రతిరోజూ నిలబడి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
- నిలబడి తినడంవల్ల ఆకలిపై అవగాహన ఉండదు. దాంతో ఎంత తింటున్నది తెలియదు. తెలియకుండానే ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటారు.
- నిలబడి తినడంవల్ల పేగులు కుంచించుకుపోతాయి. తిన్నది జీర్ణం కాదు.
- నిలబడి తినడం వల్ల కాళ్లు, తుంటిపై ప్రభావం ఉంటుంది. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
- గొంతు నుంచి నేరుగా కడుపులోకి వెళుతుంది. దీనివల్ల అన్నవాహికపై దుష్ప్రభావం పడుతుంది. దీనివల్ల అల్సర్లు వస్తాయి.
- ఆహారం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లడం వల్ల.. కడుపునొప్పి, ఉబ్బరానికి దారితీస్తుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. నిలబడి తినడం వల్ల.. అనారోగ్య సమస్యలు వాటిల్లే ప్రమాదం ఉంది కనుక.. ప్రశాంతంగా కూర్చొని తినడం అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.