Apr 11,2023 14:31

ప్రజాశక్తి-పీలేరు(అన్నమయ్యజిల్లా) : 2023-24 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్‌ బిసి బాలికల గురుకుల పాఠశాల పీలేరులో 5వ తరగతి ప్రవేశానికి 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ అహమద్‌ బాష తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా, పీలేరులోని తమ పాఠశాలలో అడ్మిషన్ల కోసం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోడానికి అర్హులని అన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 24లోగా ష్ట్ర్‌్‌జూర://aజూతీర.aజూషటరర.ఱఅ వెబ్‌ సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రవేశపరీక్ష ''మే'' 20న జిల్లా ప్రధానకేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.