Oct 10,2023 11:47

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె.కృష్ణవేణి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ ... ఈ నెల 19వ తేదీన బాబు అండ్‌ బాబు కన్వెన్షన్‌ హాల్లో యూనియన్‌ జిల్లా మహాసభలు జరుగుతున్నాయని ప్రకటించారు. ఈ మహాసభలకు యూనియన్‌ రాష్ట్ర నాయకులు అధ్యక్షులు బేబీరాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావులు హాజరవుతారని ఈ మహాసభలు జయప్రదానికి అందరూ సహకరించాలని కోరారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో మొదటిసారి ఈ సభ జరుగుతుందని ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు అంగన్వాడీల సమస్యల పరిష్కారం అలాగే నూతన నాయకత్వం ఎంపిక భవిష్యత్‌ కర్తవ్యాల్ని ఈ మహాసభలో దిశానిర్దేశం చేయడానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ సభ జరుగుతుందని తెలిపారు. అంగన్వాడీలు పెద్ద ఎత్తున కార్యక్రమంలోని పాల్గని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.