నాగార్జునసాగర్, పులిచింతల జలాశయా లకు వరద కొనసాగుతోంది. సాగర్‌కు మంగళవారం సాయంత్రం 1,30,261 క్యూసెక్కులు వస్తుండగా, అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలకు 1.16 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, అదే స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి పులిచింతలతో పాటు మున్నేరు తదితర ప్రాంతాల నుంచి మొత్తం 1.64 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, ఐదు వేల క్యూసెక్కుల నీటిని పంట కాలువలకు, 1.59 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.










