ఇంటర్నెట్‌డెస్క్ : స్టార్ హీరోహీరోయిన్ల పిల్లలు చాలా రిచ్ లైఫ్‌ని అనుభవిస్తారు. అడుగడుగునా వాళ్లకి పనులు చేసిపెట్టే పనిమనుషులు, ఎక్కడికి వెళ్లాలన్నా కార్లు.. ఇలా అన్ని సకల సౌకర్యాలతో వారు జీవిస్తారు. అయితే అమితాబచ్చన్ మనవరాలు నవ్యా నవేలి నందా రిచ్ లైఫ్‌కి భిన్నంగా... వీధుల్లో ఓ సాధారణ అమ్మాయిలా తిరిగింది. చిరువ్యాపారులతో ముచ్చటించింది. ఓ బార్బర్ షాపుకెళ్లి హెయిర్ కట్ చేయించుకుంది. ఆ షాపులో ఉన్న అద్దంలో బార్బర్, తాను కనిపంచేలా ఓ సెల్ఫీ తీసుకుంది. అలాగే అక్కడ ఓ టిఫిన్ సెంటర్ వద్ద సమోసాలను తిన్నది. కేవలం సమోసాలనే కాదు.. అక్కడ స్థానికంగా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్‌ని తిన్నది. భోపాల్‌లో బిజీ మార్కెట్‌లలో తాను ఎంజారు చేసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను 92 వేలమందికి పైగా నెటిజన్లు లైక్ చేశారు. ఇన్‌స్టాలో పోస్ట్ అయిన ఫొటోస్‌ని చూసి.. నవ్య తల్లి శ్వేతా బచ్చన్ నందా.. 'నవ్యా.... నువ్వేనా' అంటూ షాక్ అయ్యారు. ఇక హీరోయిన్ అనన్యపాండే రెడ్ హార్ట్ ఎమోజీలు పోస్ట్ చేశారు. నవ్యా ఫొటోస్‌ను చూసిన నెటిజన్లు.. 'స్టార్ కిడ్‌లా కాకుండా.. సాధారణ అమ్మాయిలా నవ్యా ఉంది' అంటూ కామెంట్ చేశారు. మరొక నెటిజన్ 'మీరు చాలా సింపుల్‌గా ఉన్నారు. మీరు నిజాయితీగా మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్లండి' అంటూ కామెంట్ చేశారు.










