Sep 15,2023 08:13

తవనంపల్లి (చిత్తూరు) : చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి వద్ద రోడ్డుపై ఆగి ఉన్న పాల వ్యాన్‌ను అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.