Sep 13,2023 20:38
  • సిపిఐ(ఎం) రాష్ట్ర కాద్యదర్శి వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి -తిరువూరు : ఎడాపెడా విధిస్తున్న విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపిత ఉద్యమానికి సిద్ధం కావాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కాద్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఎన్‌టిఆర్‌ జిల్లా తిరువూరులో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ట్రూ అప్‌ ఛార్జీలు, ఇతర ఛార్జీల పేరుతో భారీగా పెరిగిన విద్యుత్‌ బిల్లులతో ప్రజలు అల్లాడుతున్నారని, ఈ భారాలకు వ్యతిరేకంగా అందరిని కలుపుకుని ఉద్యమించేందుకు సిపిఎం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర సచివాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో సర్కార్‌ చెల్లించాల్సిన విద్యుత్‌ బిల్లుల మీద వేసే వడ్డీని కూడా ట్రూ ఆఫ్‌ చార్జీల పేరుతో ప్రజల నుండి పిండుకోవడం దుర్మార్గమని శ్రీనివాసరావు విమర్శించారు.. గహ వినియోగ దారులతో పాటు చిన్నచిన్న పరిశ్రమలు కూడా పెరిగిన విద్యుత్‌ ఛార్జీలను భరించలేకపోతున్నాయని, దీంతో పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదాని కంపె నీకి స్మార్ట్‌ మీటర్లను కాంట్రాక్ట్‌ ఇచ్చిందని, కాబట్టి అదానీకి లాభం చేకూర్చడం కోసమే ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రజలపై రుద్దుతోందని అన్నారు...
ఆ తరువాత జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించి రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 400 మండలాల్లో వార్షాభావ పరి స్థితులు నెలకొన్నాయని, ప్రత్యామ్నాయ పంటల సాగుకు కౌలు రైతులకు కూడా ఇన్‌ పుట్‌ సబ్సిడీ వర్తింపచేయాలన్నారు.. అక్టోబర్‌ నుండి నవంబర్‌ 7 వరకు సిపిఎం ప్రత్యామ్నాయ రాజకీయ విధానంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్ల డించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకే విధానపరమైన రాజకీయం కొనసాగుతుందని, దేశానికి ప్రమాదకరంగా మారిన బిజెపి యెడల అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ, జనసేనాలు అనుకూలంగా ఉన్నాయని, కానీ రాష్ట్రంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రజలను పక్క దారి పట్టిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. సిపిఎం సూత్రబద్ధమైన రాజకీయ వైఖరితో స్పష్టంగా ఉందని, బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కలిసి పనిచేస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సదస్సుకు సిపిఎం తిరువూరు పట్టణ కార్యదర్శి మేకల నాగేంద్ర ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి డివి.కష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట కళ్యాణ్‌, పగడాల వీరాంజనేయులు, సీనియర్‌ నాయకులు సాని కొమ్ము నాగేశ్వరరెడ్డి, గుల్లపల్లి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.