Apr 11,2023 10:11
  • మధ్యాహ్న భోజనానికి నిధులు కరువు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : విద్యకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వైసిపి ప్రభుత్వం చెబుతున్న దానికి, వాస్తవిక పరిస్థితికి తేడా ఉంది. బడ్జెట్‌లో ఈ రంగానికి గత నాలుగేళ్లుగా జరిపిన కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.
         నాడు-నేడు పథకంలో భాగంగా నాలుగేళ్లలో మొత్తం రూ.పది వేల కోట్లు కేటాయిరచినప్పటికీ రూ.7,872 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే రూ.2,128 కోట్లు మురగబెట్టారన్న మాట. ఒక్క 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే కేటాయిరపులు కన్నా ఎక్కువ నిధులు ఖర్చు చేశారు. ఆ ఏడాది రూ.1,500 కోట్లు కేటాయిరచగా, రూ.3,122 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్లు కేటాయిరచగా, రూ.వంద కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు లెక్కలు తేలాయి. పేద విద్యార్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం వ్యయం కూడా తక్కువగా నమోదవుతోరది. ఈ నాలుగేళ్లలో రూ.6,155 కోట్లు కేటాయిరచగా, అరదులో రూ.3,736 కోట్లు మాత్రమే వ్యయం జరిగిరది. ప్రతి ఏడాదీ కేటాయిరపుల కన్నా వ్యయం తక్కువగా ఉన్నట్లు కనిపిరచిరది. అరదుకే ఈ పథకంలో వంట వారికి, నిర్వహణకు కూడా నిధులు చాలని పరిస్థితి నెలకొనడర, దీనిపై ఆరదోళనలు కూడా చోటుచేసుకోవడం గమనార్హం.

112