Jul 20,2022 12:48

లింగగూడెం (ఎన్‌టిఆర్‌) : కరెంట్‌ షాక్‌ తగిలి వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని లింగగూడెం గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... లింగగూడెం గ్రామానికి చెందిన భూక్య సతీష్‌ (25) కూలి పనుల నిమిత్తం పొలంలోకి వెళ్లి మోటర్‌ వేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడు సతీష్‌ భార్య ఎనిమిది నెలల గర్భవతి. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.