Jul 25,2023 08:32
  • రాష్ట్రపతి ఆమోదం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను నియమించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు. జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని జులై 5న సిజెఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసిన విషయం విదితమే. జస్టిస్‌ ఠాకూర్‌ ప్రస్తుతం ముంబయి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.