ఇబ్రహీంపట్నం (ఎన్‌టిఆర్) : గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం ఇబ్రహీంపట్నం కొత్తూరు వద్ద చోటుచేసుకుంది. వ్యక్తిని ఢీకొట్టిన లారీ ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










