Aug 11,2022 11:41

ప్రజాశక్తి -తిరువూరు(ఎన్టీఆర్‌ జిల్లా) : తిరువూరు పట్టణంలో పోలీసులు, పూర్వ విద్యార్థుల సంఘం, విద్యార్థులు గురువారం ఉదయం ఆజాదీక అమత్‌ మహోత్సవంలో భాగం చీరాల సెంటర్‌ నుండి పురవీధులలో ఊరేగింపుగా బయలుదేరి పాత బస్టాండ్‌ సెంటర్‌, బోసు బొమ్మ సెంటర్‌, మధిర రోడ్డు సెంటర్‌, బైపాస్‌ రోడ్డు వరకు 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు 75 ఏళ్ల స్వాతంత్య్రం వివరాలను నినాదాలతో ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల పోలీసులు, పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.