Apr 19,2023 16:20

ఐపీఎల్‌-2023లో భాగంగా జైపూర్‌లోని సువారు మాన్‌సింగ్‌ స్టేడియంలో టాప్‌ జట్ల మధ్య నేడు రసవత్తర పోరు జరగనుంది. టాప్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, రెండో స్థానంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడనున్నాయి. రాజస్థాన్‌ బ్యాటింగ్‌లో బట్లర్‌, యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్‌, షిమ్రోన్‌ హెట్‌మైర్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌ విభాగంలో బౌల్ట్‌, సందీప్‌ శర్మ, అశ్విన్‌, చహల్‌ అద్భుతంగా రాణిస్తున్నారు.
లక్నో సూపర్‌ జెయింట్స్‌లో కైల్‌ మేయర్స్‌, మార్కస్‌ స్టోయినిస్‌, నికోలస్‌ పూరన్‌ వన్‌ మ్యాచ్‌ వండర్స్‌లా రాణిస్తున్న, కేఎల్‌ రాహుల్‌ ఆకట్టుకోలేకపోతున్నాడు. బౌలింగ్‌ మార్క్‌ వుడ్‌, ఆవేశ్‌ ఖాన్‌, కృష్ణప్ప గౌతమ్‌, బిష్ణోరు పర్వాలేదనిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఎవరు హ్యాట్రిక్‌ విజయం సాధిస్తారో వేచి చూడాల్సి ఉంది.
జట్లు అంచనా
రాజస్థాన్‌ రాయల్స్‌ : జోస్‌ బట్లర్‌, యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌(వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), రియాన్‌ పరాగ్‌, షిమ్రాన్‌ హెట్మెయర్‌, ధ్రువ్‌ జురెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ఆడమ్‌ జంపా, సందీప్‌ శర్మ, యుజ్వేంద్ర చాహల్‌
లక్నో సూపర్‌ జెయింట్స్‌ : కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), కైల్‌ మేయర్స్‌, దీపక్‌ హుడా, మార్కస్‌ స్టోయినిస్‌, కనాల్‌ పాండ్యా, నికోలస్‌ పూరన్‌(వికెట్‌కీపర్‌), ఆయుష్‌ బడోని, అవేష్‌ ఖాన్‌, యుధ్వీర్‌ సింగ్‌ చరక్‌, మార్క్‌ వుడ్‌, రవి బిష్ణోరు