జైపూర్ : గుండె దడతో బాధపడుతున్న ఓ 70 ఏళ్ల మహిళకి శస్త్ర చికిత్స చేయకుండానే.. నాన్ సర్జికల్ విధానం ద్వారా ఆమె బాధను తగ్గించారు వైద్యులు. ఈ సంఘటన తాజాగా జైపూర్‌లో జరిగింది. సాధారణంగా ఎవరికైనా గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. అయితే ఈ 70 ఏళ్ల మహిళకి మాత్రం నిమిషానికి 175సార్లు కొట్టుకుంటుంది. ఇలా గుండె అధిక వేగంగా కొట్టుకోవడం వల్ల ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది. అలాగే గుండె నొప్పి కూడా వస్తోంది. ఈ బాధను తట్టుకోలేక రాత్రిపూట ఆమె జైపూర్‌లోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చేరింది. ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు... ఎడమ కర్ణికకు చిన్నపాటి గాటు పెట్టి... వేలుపొడుగున్న చిన్న గొట్టాన్ని అమర్చారు. దీన్నే లెఫ్ట్ అట్రియల్ అపెండెజ్ అని పిలుస్తారు. ఈ పరికరం కర్ణికలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుందని అని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను ఫోర్టిస్ ఎస్కార్ ్ట హాస్పిటల్ కార్డియాలజీ డైర్టెర్ డాక్టర్ సంజీబ్ రారు నేతృత్వంలో వైద్యుల బృందం విజయవంతంగా పూర్తి చేసింది. నాన్‌సర్జికల్ ద్వారా చేసిన ఈ విధానంతో ఆమె గుండె దడ తగ్గి.. ఆ మరుసటి రోజునే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని సంజీబ్ రారు తెలిపారు.










